Delhi Liquor scam: నిన్న సిసోదియా సన్నిహితుడు.. నేడు మద్యం వ్యాపారి..!

దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor scam) కేసులో పలు అరెస్టులు కొనసాగుతున్నాయి.

Updated : 28 Sep 2022 15:09 IST

మద్యం స్కామ్‌లో కొనసాగుతోన్న అరెస్టులు 

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor scam) కేసులో పలు అరెస్టులు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్ అభియోగాల కింద బుధవారం ఉదయం ఈడీ(ED) మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్రును అరెస్టు చేసింది. ఈ కేసులో రాత్రి మొత్తం ప్రశ్నించిన అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం సమీర్‌.. ఇండోస్పిరిట్స్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు విజయ్‌ నాయర్‌ను నిన్న సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిణామాలు భాజపా, ఆప్‌ మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇదంతా తమ పార్టీని నిలువరించేందుకు కాషాయ పార్టీ చేస్తోన్న కుటిలయత్నమని ఆప్‌ మండిపడుతోంది. 

కొత్త ఎక్సైజ్‌ విధానంలో.. కొన్ని లోపాలు ఉన్నాయని, టెండర్ల జారీ తర్వాత మద్యం లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా దీన్ని తయారుచేశారని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఓ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఈ విధానంపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐకి గతంలో సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో చోటుచేసుకున్న నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు మద్యం లైసెన్సుల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోణలతో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను సీబీఐ నిందితుడిగా చేర్చింది. మరోవైపు, విపక్షాల నుంచి విమర్శలు ఎదురవ్వడంతో గత నవంబర్‌లో ఈ విధానంపై ఆప్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts