Anil Deshmukh: 27 కంపెనీలతో మనీ లాండరింగ్‌..!

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆయన అవినీతి, మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Published : 29 Dec 2021 23:04 IST

 అనిల్‌ దేశ్‌ముఖ్‌, కుటుంబ సభ్యులపై ఈడీ ఛార్జిషీట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆయన అవినీతి, మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్పెషల్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో దేశ్‌ముఖ్‌ ఇద్దరు కుమారుల పేర్లు కూడా ఉన్నాయి. లంచాల రూపంలో వసూలు చేసిన సొమ్మును దేశ్‌ముఖ్‌ కుటుంబానికి చెందిన ‘సాయి శిక్షణ్‌ సంస్థ’ అనే ట్రస్ట్‌కు విరాళాల రూపంలో మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ సంస్థకు దిల్లీలోని కొన్ని డమ్మీ కంపెనీల నుంచి విరాళాలు వచ్చినట్లు చూపిస్తున్నారు. దేశ్‌ముఖ్‌ కుటుంబీకులు 27 కంపెనీలను మనీ లాండరింగ్‌ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది.

అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈడీ అధికారులు నవంబర్‌ 2వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన  అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్​ముఖ్​తో పాటు కుందన్​ షిండే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100 కోట్లు  వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ చర్యలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని