ED chief: కేంద్రం కీలక నిర్ణయం.. ఈడీ చీఫ్‌ పదవీ కాలం పొడిగింపు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ......

Published : 17 Nov 2021 21:29 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో మరో ఏడాది వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 2022 నవంబర్‌ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఆయన ఈడీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్ల వరకూ (రెండేళ్ల ప్రాథమిక పదవీకాలం తర్వాత) పొడిగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చాక తొలిసారి ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు అవకాశాన్ని పొందిన అధికారిగా సంజయ్‌ కుమార్‌ మిశ్రా నిలవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని