Tejashwi Yadav: తేజస్వీ యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు..!
బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఉద్యోగాలకు భూమి(Land For Job Case) కేసులో పలు ప్రాంతాల్లో వీటిని చేపట్టింది.
దిల్లీ: ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల (Land For Job Case) కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. కొద్దిరోజుల క్రితం లాలూ, ఆయన భార్య రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించింది. తాజా తనిఖీల్లో ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ దిల్లీ ఇల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ముంబయిలోని ఆయన కుటుంబానికి చెందిన పదులకుపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. లాలూ సన్నిహితుడు, ఎమ్మెల్యే అబు దొజానా ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆధారాలను గుర్తించేందుకు ఈ తనఖీలు చేపట్టినట్లు ఈడీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA) హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారిస్తోంది. ఇప్పుడు మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్