Published : 28 Jun 2022 17:16 IST

Sanjay raut: సంజయ్‌ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

ముంబయి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు (Sanjay Raut) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో ప్రశ్నించేందుకు మంగళవారం (ఈరోజు) తమ ఎదుట హాజరుకావాలంటూ నిన్న ఈడీ అధికారులు సమన్లు జారీ చేయగా.. తనకు అలీబాగ్‌లో సమావేశం ఉన్నందున హాజరుకాలేనని, మరింత సమయం ఇవ్వాలని ఆయన అధికారుల్ని కోరారు. దీంతో జులై 1న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు ఇచ్చింది.

సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు సమన్లు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఓ పక్క అధికార శివసేన శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం, మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. 

మరోవైపు, సంజయ్‌ రౌత్‌ తరఫు న్యాయవాదులు ముంబయిలోని ఈడీ అధికారులను కలిశారు. రౌత్‌ హాజరయ్యేందుకు రెండు వారాల పాటు గడువు ఇవ్వాలని కోరారు. అయితే, ఈడీ మాత్రం ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చింది. జులై 1న తమ ఎదుట హాజరు కావాలంటూ తాజాగా సమన్లు ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో రౌత్‌ను ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఈడీ భావిస్తోంది. నిన్న మధ్యాహ్నం ఈడీ సమన్లు ఇచ్చింది. ఈడీ కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరడంతో అందుకు కొంత సమయం కోరుతూ దరఖాస్తు చేశాం అని రౌత్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని