Updated : 26 May 2022 11:01 IST

ED Raids: మహారాష్ట్ర మంత్రి అనిల్‌ పరబ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

ముంబయి: మహారాష్ట్రలో మరో మంత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు జరిపింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్‌ పరబ్‌ నివాసంలో ఈ ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనిల్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.

రత్నగిరి జిల్లాలోని దాపోలీ తీర ప్రాంతంలో ఓ భూమి కొనుగోలు ఒప్పందంలో అనిల్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఆయనపై మనీలాండరింగ్‌ చట్టం కింద నమోదు చేసింది. 2017లో అనిల్‌ దాపోలీ ప్రాంతంలో ఓ భూమిని రూ.కోటికి కొనుగోలు చేశారు. దాన్ని 2019లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత 2020లో ముంబయికి చెందిన కేబుల్‌ ఆపరేటర్‌ సదానంద్‌ కడమ్‌కు రూ.1.10కోట్లకు ఆ భూమిని విక్రయించారు. అయితే 2017-2020 మధ్య ఆ భూమిలో పరబ్‌ తన బిజినెస్‌ భాగస్వామి సదానంద్‌తో కలిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఓ రిసార్ట్‌ను నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐటీ శాఖ గతంలో విచారణ జరపగా.. ఆ రిసార్ట్‌ నిర్మాణం కోసం రూ.6కోట్లకు పైగా నగదును వెచ్చించారని, అదంతా లెక్కల్లో చూపని డబ్బే అని తేలింది. దీంతో ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

కాగా.. మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన ఓ మనీలాండరింగ్‌ కేసులో గతేడాది ఈడీ అనిల్‌ పరబ్‌ను విచారించింది. అయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని