Arvind Kejriwal: కేజ్రీవాల్‌ డబ్బు డిమాండ్‌ చేసినట్లుగా ఆధారాలున్నాయి: ఈడీ

మద్యం కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు డిమాండ్‌ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ దిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టుకు తెలిపింది. 

Published : 19 Jun 2024 16:37 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణం(liquor scam)లో అరెస్టయిన కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు డిమాండ్‌ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది.

కేజ్రీవాల్‌ పీఎంఎల్‌ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆయన పేరు లేదని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి(Vikram Chaudhary)  వాదించారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్నారు. కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్‌ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు