ED raids: ఈడీ సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం

ముంబయి, నాగ్‌పూర్‌లలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఈడీ సీజ్‌ చేసింది. 

Published : 07 Mar 2023 00:05 IST

ముంబయి: మహారాష్ట్రలో జరిపిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) అధికారులు భారీగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కాం కేసులో మార్చి 3న నాగ్‌పూర్‌, ముంబయి నగరాల్లోని 15 చోట్ల జరిపిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.5 కోట్లకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు, భారీగా నగదును ఈడీ సీజ్‌ చేసింది. ఈ వివరాలను ట్విటర్‌లో వెల్లడించింది. పంకజ్‌ మెహదియా అనే వ్యక్తి  ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలతో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు నాగ్‌పుర్‌లోని సీతాబుల్ది పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీని ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

పంకజ్‌ మరికొందరితో కలిసి ఫోంజీ స్కీమ్‌ నడిపారని.. 2004 నుంచి 2017 వరకు పెట్టిన పెట్టుబడులపై టీడీఎస్‌ మినహాయించి 12శాతం లాభాలు ఇస్తానంటూ వాగ్దానం చేసి పలువురు ఇన్వెస్టర్లను నమ్మించినట్టు విచారణలో వెల్లడైంది.  రూ.కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పంకజ్‌ మెహాదియా, లోకేశ్ సంతోష్‌ జైన్‌, కార్తిక్‌ సంతోష్‌ జైన్‌లకు చెందిన  నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ.5.51 కోట్ల విలువ చేసే   బంగారు ఆభరణాలతో పాటు రూ. 1.21కోట్ల నగదు గుర్తించినట్టు వెల్లడించారు. అలాగే, పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు,  నేరారోపణకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు