Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నాలుగో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేసులో సిసోదియా పాత్రపై అభియోగాలను ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. ఛార్జ్‌షీట్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది..

Updated : 30 May 2023 19:24 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేసులో సిసోదియా పాత్రపై అభియోగాలను ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. ఛార్జ్‌షీట్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చార్జ్‌షీట్‌లో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. కవితపై గత ఛార్జ్‌షీట్‌లోని అంశాలనే ఈడీ మరోసారి ఈ ఛార్జ్‌షీట్‌లోనూ ప్రస్తావించింది.

‘‘సౌత్‌ గ్రూప్‌, ఆప్‌ నేతలకు మధ్య ఒప్పందం ఉంది. దిల్లీ మద్యం పాలసీలో సిసోదియా అక్రమాలకు పాల్పడ్డారు. సౌత్‌ గ్రూపునకు లబ్ధికలిగేలా పాలసీ రూపొందించారు. సౌత్‌ గ్రూప్‌ నుంచి ఆప్‌ నేతలకు ముడుపులు ముట్టాయి’’ అని ఛార్జ్‌షీట్‌లో ఈడీ అభియోగాలు దాఖలు చేసింది. దర్యాప్తులో భాగంగా 51 మందిని ప్రశ్నించామని పేర్కొంటూ వారి వివరాలను ఛార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించింది. అయితే, ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో ఎమ్మెల్సీ కవిత పేరు మాత్రం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని