Farooq Abdullah: ‘ఈడీ సమన్లు ఆయనకు కొత్తేం కాదు.. దేశంలో ప్రతిపక్ష నేతలకు ఇది కామనే’’!

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ....

Published : 27 May 2022 18:46 IST

ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లపై ఎన్‌సీ ట్వీట్‌

దిల్లీ: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆ పార్టీ స్పందించింది. ఆయనకు ఈడీ నుంచి సమన్లు కొత్తేమీ కాదని, గతంలో లాగే అధికారులకు ఆయన సహకారం కొనసాగుతుందని ట్వీట్‌ చేసింది. ‘ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు కొత్తేమీ కాదు. దేశంలో ప్రతిపక్ష నేతలందరికీ ఇది సర్వసాధారణమైపోయింది. ఈ కేసులో ఫరూక్‌ అబ్దుల్లా నిర్దోషిత్వాన్ని కొనసాగించారు. గతంలో మాదిరిగానే దర్యాప్తు సంస్థలకు తన సహకారం కొనసాగిస్తారు’’ అని ట్విటర్‌లో పేర్కొంది.

మరోవైపు, మనీలాండరింగ్‌ కేసులో ఈ నెల 31న విచారణకు రావాలని ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ అధికారులు శుక్రవారం సమన్లు పంపారు. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (JKCA)లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల వ్యవహారంలో దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆయన్ను విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ.. 2020లో ఆయనకు చెందిన రూ.11.86కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫరూక్‌ అబ్దుల్లా తన పదవిని దుర్వినియోగ పరుస్తూ నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని