Byjus: అది నకిలీ చిత్రం.. మా స్టడీ మెటీరియల్‌లో లేదు..!

అది నకిలీ చిత్రం. అది మా మెటీరియల్ కాదు. మా కంటెంట్‌పై వాటర్‌ మార్క్‌ ఉంటుంది. అంతేగాకుండా మా లోగోని  కూడా తప్పుగానే చూపారు. మా లోగో కింద మేం గీతను ఉపయోగించం.

Updated : 10 Oct 2022 12:54 IST

దిల్లీ: తన సంస్థ లోగోతో ఉన్న భారతదేశ పటాన్ని తప్పుగా చూపిన చిత్రం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై  ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌ స్పందించింది. ఇది నకిలీ చిత్రమని, అది తమ స్టడీ మెటీరియల్‌కు చెందినది కాదని ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. 

‘అది నకిలీ చిత్రం. అది మా మెటీరియల్ కాదు. మా కంటెంట్‌పై వాటర్‌ మార్క్‌ ఉంటుంది. అంతేగాకుండా ఆ పటంపై మా లోగోని  కూడా తప్పుగానే చూపారు. మా లోగో కింద మేం గీతను ఉపయోగించం. దీనిని దురుద్దేశంతో సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేం పంపిణీ చేసిన మెటీరియల్ జాతీయ స్థాయిలో అక్రిడేషన్‌ బోర్డులకు అనుగుణంగా ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం’ అని బైజూస్ ట్వీట్‌ చేసింది. సోషల్ మీడియాలో ఆ భారత పటాన్ని గుర్తించి, నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. మరికొంత మంది ఇది ఫొటోషాప్‌ ఇమేజ్ అని స్పష్టంగా తెలుస్తుందంటూ  రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే బైజూస్ నుంచి స్పష్టత వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని