Published : 14/11/2021 18:53 IST

Odisha: ఉపాధ్యాయిని హత్య కేసు.. మంత్రి, ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి

భువనేశ్వర్‌: ఒడిశాలో ఓ ఉపాధ్యాయురాలి అపహరణ, హత్య కేసు విషయంలో ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్‌ నేతలు చేపడుతున్న నిరసనలు తీవ్రతరమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడికి రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి డీఎస్ మిశ్రాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. ఆయన్ను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వేర్వేరు చోట్ల రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిశాఖ మంత్రి జగన్నాథ్‌ సారక, అధికార బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్నేహాంగిని ఛురియా కాన్వాయ్‌లపై గుడ్లు విసిరారు. వీరిద్దరూ బర్‌గఢ్‌ జిల్లాలోని బిజేపూర్‌లో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమావేశానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. అంతకుముందు రాష్ట్ర ఉక్కు, గనులశాఖ మంత్రి ప్రఫుల్ల మాలిక్‌కూ బీజేవైఎం కార్యకర్తలనుంచి నిరసన ఎదురైంది.

అండగా నిలుస్తున్నారని ఆరోపణలు..

రాష్ట్రంలోని కలహండీ జిల్లాలో అక్టోబర్ 8న ఓ 24 ఏళ్ల ఉపాధ్యాయిని అపహరణకు గురయ్యారు. అక్టోబర్ 19న ఓ స్కూల్ ప్రాంగణంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో పాఠశాల మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రధాన నిందితుడితోసహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ప్రధాన నిందితుడికి అండగా నిలుస్తున్నారని, ఓసారి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు సహకరించారని ఆరోపిస్తూ.. మంత్రి డీఎస్‌ మిశ్రాను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేసు దర్యాప్తులోనూ ఆలస్యం జరుగుతోందంటూ విమర్శించగా.. ఎలాంటి జాప్యం జరగడం లేదని, కేసు సరైన దిశగానే సాగుతోందని డీఐజీ దీపక్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని