Suicide: వారిలో మూడింట ఒక వంతు మందికి ఆత్మహత్య ఆలోచనలు!
మానసిక అనారోగ్య బాధితులకు కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ను గత 18 నెలల్లో సంప్రదించిన వారిలో.. మూడింట ఒక వంతు మంది కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లు తెలిపారని ఓ సర్వే వెల్లడించింది.
బాధితుల్లో 81 శాతం మంది తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లోని వారే..
దిల్లీ: మానసిక అనారోగ్య బాధితులకు కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ను గత 18 నెలల్లో సంప్రదించినవారిలో.. మూడింట ఒక వంతు మంది కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లు తెలిపారని ఓ సర్వే వెల్లడించింది. గత నవంబరు - జనవరి మధ్య ఇటువంటి సంభాషణలు దాదాపు 40శాతం చోటుచేసుకున్నాయని ‘ది సైరస్ అండ్ ప్రియా వంద్రేవాలా’ ఫౌండేషన్ తెలిపింది. గతేడాది భారత్‌లో హత్యలు, కరోనా వైరస్ ద్వారా చోటుచేసుకున్న మరణాల కన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోయినవారి సంఖ్యే ఎక్కువని ఆ సంస్థను నిర్వహిస్తున్న ప్రియా హీరానందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న వైద్య విద్యార్థులందరూ మానసిక వైద్యులుగా మారినా, మానసిక అనారోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సరిపోరని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై తమను సంప్రదించినవారిలో 81శాతం తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ