Eknath Shinde: సంజయ్ సుపారీ ఆరోపణలు..నిజం కాదని తేలితే చర్యలు తప్పవు

రాజకీయ నేత సంజయ్‌ రౌత్‌ చేసిన సుపారీ ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిందే(Eknath Shinde) స్పందించారు. దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించారు. 

Updated : 22 Feb 2023 18:49 IST

పుణె: తనను చంపించేందుకు ముఖ్యమంత్రి కుమారుడు సుపారీ ఇచ్చినట్లు శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్(Sanjay Raut) తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) స్పందించారు. ‘మేం పౌరులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో ఆటలాడుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. 

తనను చంపేందుకు శిందే కుమారుడు ఓ నేరస్థుడికి సుపారీ (Supari) ఇచ్చారంటూ ముంబయి పోలీసు కమిషనర్‌కు సంజయ్‌ రౌత్‌(Eknath Shinde) ఫిర్యాదు చేశారు. ‘నన్ను చంపించేందుకు ఠాణెకు చెందిన రాజా ఠాకూర్‌ అనే ఓ నేరస్థుడికి లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ శిందే సుపారీ ఇచ్చారు. ఈ విషయంపై నాకు విశ్వసనీయ సమాచారం ఉంది. బాధ్యత కలిగిన పౌరుడిగా నేను మీకు సమాచారం ఇస్తున్నాను’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇది ఆందోళన కలిగించే విషయం: సుప్రియా సూలే

రౌత్ సుపారీ ఆరోపణలపై ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే స్పందించారు. ‘రౌత్ చెప్పిన విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి దీనిపై విచారణకు ఆదేశించాలి’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. శివసేన (Shiv Sena) పార్టీ పేరు, గుర్తు విల్లు-బాణం కొనుగోలు చేసేందుకు రూ.2వేల కోట్ల ఒప్పందం జరిగిందని రౌత్‌(Sanjay Raut) ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని