maharashtra crisis: త్వరలో ముంబయికి వెళతాను: ఏక్‌నాథ్‌ శిందే

త్వరలో ముంబయికి వెళతానని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నేత ఏక్‌నాథ్‌ శిందే వెల్లడించారు. ఆయన గువహాటిలో మీడియాతో మాట్లాడారు.

Updated : 28 Jun 2022 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో ముంబయికి వెళతామని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నేత ఏక్‌నాథ్‌ శిందే వెల్లడించారు. ఆయన గువహాటిలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను, తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ముంబయికి వెళతామని పేర్కొన్నారు. ‘‘మా ప్రతినిధి దీపక్‌ కేసర్కర్‌ త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. మేము శివసేనతోనే ఉన్నాము. శివసేనను తీసుకొంటామనటంలో ఎటువంటి సందేహం లేదు. మా విధానం స్పష్టంగా ఉంది. మేము త్వరలోనే ముంబయి వెళుతున్నాం’’ అని శిందే పేర్కొన్నారు. శివసేన బాలాసాహెబ్‌ వర్గం ఏర్పాటుపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ వర్గంతో టచ్‌లో ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేయాలని సవాలు చేశారు.  శిందే వర్గం రెబల్‌ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 50 మంది గురువారం ముంబయికి వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే నేటి సాయంత్రం మంత్రివర్గ భేటీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో థానే జిల్లా పార్టీ సమన్వయ కర్తను ఉద్ధవ్‌ వర్గం పార్టీ నుంచి బహిష్కరించింది. 

ఈడీ ఎదుట హాజరుకాకుండానే అలీబాగ్‌కు రౌత్‌

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ నేడు ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశాలు లేవు. ఆయన ఓ ర్యాలీలో ప్రసంగించేందుకు అలీబాగ్‌కు వెళ్లిపోయారు. అనంతరం ఆయన అక్కడ కుటుంబ సభ్యులను కూడా కలవనున్నారు. ఆయన తరపున న్యాయవాదులు ఈడీని కలిసి మరింత సమయం కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని