Updated : 29 Jun 2022 23:12 IST

Vice President election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా..

దిల్లీ: తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ ఖరారు చేసింది. ఆగస్టు 6న (శనివారం) ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. జులై 17 నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీగా పేర్కొంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

ఎలా ఎన్నుకుంటారంటే?
ఉప రాష్ట్రపతిని పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకొని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

ముఖ్యమైన తేదీలివే..
* ఉప రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌ - జులై 5, 2022

నామినేషన్లకు చివరి తేదీ- జులై 19

నామినేషన్ల పరిశీలన- జులై 20

నామినేషన్ల ఉపసంహరణకు గడువు- జులై 22

ఎన్నిక తేదీ- ఆగస్టు 6 (ఉదయం 10గంటలనుంచి సాయంత్రం 5గంటలవరకు)

ఫలితం- పోలింగ్‌ ముగిసిన రోజే వెల్లడి కానుంది.

కాగా.. తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార, విపక్ష పార్టీలు ఎవరిని బరిలో దించుతాయనే దానిపై ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓబీసీ, జనరల్‌ కేటగిరీకి చెందిన మహిళను బరిలోకి దించుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దక్షిణాది నుంచి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన ఎన్డీయే.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎవరిని తమ అభ్యర్థిగా బరిలోకి దించుతుందో చూడాలి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని