ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఎన్నికల అధికారులు

పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక

Updated : 26 Feb 2021 19:33 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా పరిగణించి వారికి కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోడా ప్రకటించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఓటింగ్ సమయాన్ని ఒక గంట వరకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా సమయంలో దేశంలోని అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది, ఓటర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించింది. నామినేషన్‌ సమర్పించే సమయంలో అభ్యర్థితో పాటు, కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు జరగబోయే కేరళలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని