Train Accident: అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది.

Updated : 27 Sep 2023 08:13 IST

మధుర: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు ప్లాట్‌ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్‌ అధికారులు పేర్కొన్నారు. 

"షకుర్‌ బస్తీ నుంచి వస్తున్న ఈఎంయూ(ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) ట్రైన్‌ 10:49 గంటలకు మధుర స్టేషన్‌కు వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు గానీ.. రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం" అని మధుర స్టేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.కే. శ్రీవాస్తవ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని