AOB: ఏవోబీలో కాల్పులు.. మావోయిస్టు నేత అరుణ అంగరక్షకుడి మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు......

Published : 13 Oct 2021 15:38 IST

భువనేశ్వర్‌: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు ఒడిశా డీజీపీ అభయ్‌ వెల్లడించారు.  ఏరియా కమిటీ కార్యదర్శి అనిల్‌ అలియాస్‌ కిశోర్‌తో పాటు మావోయిస్టు నాయకురాలు అరుణ అంగరక్షకుడు మృతిచెందారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని తెలిపారు. ఘటనా స్థలంలో రెండు రైఫిళ్లు, ఆరు మ్యాగజీన్లు, 59తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని