EV chargers: కొత్త ఇంటికి అనుమతులు కావాలంటే విద్యుత్తు వాహన ఛార్జర్లు ఉండాల్సిందే..

బ్రిటన్‌ ప్రభుత్వం విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించడానికి కొత్త చట్టం తీసుకురానుంది. భవిష్యత్తులో నిర్మించే కొత్త ఇళ్లు, ఆఫీసులకు విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఛార్జర్లు

Published : 13 Sep 2021 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌ ప్రభుత్వం విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించడానికి కొత్త చట్టం తీసుకురానుంది. భవిష్యత్తులో నిర్మించే కొత్త ఇళ్లు, ఆఫీసులకు విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఛార్జర్లు తప్పని సరి. ముఖ్యంగా స్మార్ట్‌ ఛార్జింగ్‌ పరికరాలను ఉంచాలని పేర్కొంది.  వాహనాలు పార్కింగ్‌ చేయగానే ఇవి ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ చేస్తాయి. ఇక ఆఫీసుల్లోని పార్కింగ్‌ల్లో కూడా ఇవి తప్పనిసరి. ప్రతి ఐదు పార్కింగ్‌ స్థలాలకు ఒక ఛార్జర్‌ ఉండాలి. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. 

ప్రపంచంలోనే కొత్త ఇళ్లకు ఛార్జింగ్‌ పాయింట్లను తప్పని సరి చేసిన దేశంగా ఇంగ్లాండ్‌ నిలవనుంది. దేశాన్ని వేగంగా చమురు నుంచి విద్యుత్తు వాహనాల వైప మళ్లేట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి ఇంటికి ఛార్జింగ్‌ పాయింట్‌ను తప్పని సరి చేస్తూ 2019లో తొలిసారి ప్రతిపాదన వచ్చింది. 2030 నుంచి శిలాజ ఇంధనంతో నడిచే వాహనాలను బ్యాన్‌ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకొంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని