Supreme Court: కేంద్రంపై సుప్రీం ప్రశ్నల వర్షం
కరోనా కట్టడి లక్ష్యంతో నిర్వహిస్తోన్న జాతీయ టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. టీకా విధానం, సేకరణ, ధరల్లో తేడా, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్.. ఇలా పలు సమస్యలపై సోమవారం ఆరా తీసిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.
టీకా విధానం, ధరల్లో తేడా.. ఇలా పలు అంశాలపై ప్రశ్నలు
దిల్లీ: కరోనా కట్టడి లక్ష్యంతో నిర్వహిస్తోన్న జాతీయ టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. టీకా విధానం, సేకరణ, ధరల్లో తేడా, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్.. ఇలా పలు సమస్యలపై సోమవారం ఆరా తీసిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.
‘జనాభాలో 45 ఏళ్లు పైబడిన వారికోసం కేంద్రమే టీకాలు సేకరిస్తోంది. 18 నుంచి 44ఏళ్ల వారి విషయంలో మాత్రం టీకా కొనుగోలులో తేడాలున్నాయి. 50శాతంమేర తయారీ సంస్థల నుంచే రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు డోసులను కేటాయిస్తోంది. దేని ఆధారంగా కేంద్రం ఈ విభజన చేసింది. 45 ఏళ్లు పైబడిన వారికి కరోనాతో ఎక్కువ ప్రమాదం ఉందనేది మీ అంచనా అయితే.. రెండో దశలో 18-44ఏళ్ల మధ్య వయస్కులపై కొవిడ్ ఎక్కువ ప్రభావం చూపింది. టీకాలు సేకరించడం వెనుక ఉద్దేశం ఇదే అయితే.. 45 ఏళ్లు దాటిన వారినే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?’ అని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే 1 నుంచి 24 మధ్య నమోదైన కేసుల్లో 26 శాతం 18-44 మధ్య వయస్సువారిలోనే వెలుగుచూశాయి. అత్యంత ప్రమాదం పొంచి ఉన్న 60 ఏళ్లు పైబడినవారిలో అది సుమారు 13 శాతంగానే ఉంది.
అలాగే టీకా డోసులకు రాష్ట్రాలు అధిక ధరను ఎందుకు చెల్లించాలో చెప్పాలంటూ మరోప్రశ్న వేసింది. దేశం మొత్తానికి ఒకేధర ఉండేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలని సూచించింది. టీకా ధరలను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం తయారీ సంస్థలకు ఎందుకు వదిలేసిందని అడగడంతో పాటు.. కేంద్రానికి ధరలను నిర్ణయించే అధికారం ఉందని నొక్కి చెప్పింది. అంతేకాక పలు రాష్ట్రాలు కరోనా టీకాల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తోన్న అంశాన్ని ఇక్కడ ప్రస్తావించింది. దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆసక్తి ఉన్నవారు ముందుకు రావొచ్చని ఆహ్వానించగా.. మహారాష్ట్ర స్పుత్నిక్ నుంచి బిడ్లు అందుకుంది. ఈ అంశంపై ప్రశ్నిస్తూ.. ‘కేంద్రం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తోందా?విదేశాల నుంచి రాష్ట్రాలు టీకాలను పొందడం ఆచరణాత్మకం కాదు. కేంద్రం వాటిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది’ అంటూ వ్యాఖ్యానించింది.
అలాగే టీకా తీసుకునేముందు ప్రతి ఒక్కరూ కొవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలనే విషయాన్ని గుర్తుచేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమేనా? అంటూ కేంద్రాన్ని అడిగింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ‘గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కంప్యూటర్ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తరవాత టీకాను పొందొచ్చు’ అని తెలిపింది. ‘వాస్తవంగా ఇది ఆచరణాత్మకమా?’ అంటూ సుప్రీం మరోసారి ప్రశ్నించింది. వలస కార్మికులకు కూడా ఈ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది.
ఇక, ఇప్పటివరకు 21 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసింది. అలాగే మొత్తం జనాభాలో సుమారు మూడు శాతం మందికే టీకాలు అందాయి. ఇప్పటికే దేశంలో టీకా ప్రక్రియ నిదానంగా సాగుతుందనే విమర్శలుండగా.. ఈ ఏడాది చివరి నాటికి అర్హులందరికీ టీకాలు ఇస్తామని కేంద్రం చెప్తోంది. ఇదే విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. మరోవైపు, నిపుణులు కరోనా మూడో ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కరోనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు.. వేగంగా, సాధ్యమైనంత ఎక్కువమందికి టీకాలు వేయాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య
-
Movies News
Siddharth: ఒంటరిగా పోరాడలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: సిద్దార్థ్
-
Viral-videos News
viral videos: చిన్నారులుగా దేశాధినేతలు.. ఏఐ మాయ చూస్తారా..?