European Union:12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్‌ టీకా!

12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఐరోపా సమాఖ్య(ఈయూ) పచ్చజెండా ఊపింది. ‘యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ)....

Updated : 21 Dec 2022 16:32 IST

లండన్‌: 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఐరోపా సమాఖ్య(ఈయూ) పచ్చజెండా ఊపింది. యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ) సలహా కమిటీ సిఫార్సుల మేరకు టీకా వినియోగానికి ఈయూ ఆమోదం తెలిపింది.

ఈయూ సభ్యదేశాల్లో ఇప్పటికే 16 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఉంది. తాజాగా 12-15 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా టీకా అందించనున్నారు. అయితే, ఈ వర్గానికి టీకా ఇవ్వాలా? వద్దా? అనేది ఈయూ ఆయా దేశాల నిర్ణయానికే వదిలేసింది. మరోవైపు ఈయూ తాజా నిర్ణయాన్ని ఫైజర్‌ స్వాగతించింది.

12-15 ఏళ్లలోపు రెండు వేల మంది వలంటీర్లపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఫైజర్‌ టీకా సురక్షితమైంది, ప్రభావవంతమైందని తేలిన విషయం తెలిసిందే. తొలిసారి పిల్లలకు కరోనా టీకా ఇవ్వడం కెనడాలో ప్రారంభం కాగా కొన్ని రోజుల్లోనే అమెరికా సైతం అదే బాటలో పయనించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని