ఆ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతి

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రూపొందించిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతిచ్చింది. ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది....

Updated : 17 Oct 2022 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రూపొందించిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతిచ్చింది. ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ టీకా సమర్థవంతమైనదని, భద్రమైనదని, నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాతో మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో పురోగతి ఉంటుందని ఈయూ భావిస్తోంది. పౌరుల జీవితాలు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని ఈఎంఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎమోర్‌ కుక్ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని