China-Taiwan: తైవాన్‌కు అండగా.. యూరోపియన్‌ యూనియన్‌!

తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని డ్రాగన్‌ దేశం చైనా ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తైవాన్‌ సరిహద్దుల్లో వైమానిక దళాన్ని మోహరించింది. కాగా.. తైవాన్‌కు సమస్యలు తలెత్తుతే తాము అండగా ఉంటామని అమెరికా గతంలోనే వెల్లడించింది. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ కూడా తైవాన్‌కు

Updated : 05 Nov 2021 16:20 IST

తైపీ: తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని డ్రాగన్‌ దేశం చైనా ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చైనా వైమానిక దళం తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలోకి చొరబడింది. కాగా.. తైవాన్‌కు సమస్యలు తలెత్తితే తాము అండగా ఉంటామని అమెరికా గతంలోనే వెల్లడించింది. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ కూడా తైవాన్‌కు భరోసా కల్పిస్తోంది. యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుల బృందం మూడు రోజులపాటు తైవాన్‌లో పర్యటించేందుకు వచ్చింది. తైవాన్‌-ఈయూ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా పర్యటన సాగుతోందని బృందం చెబుతోంది. 

మరోవైపు తైవాన్‌ను చైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న వేళ యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు ఈ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘తైవాన్‌ ఒంటరి కాదు.. యూరప్‌ మీతోనే ఉంటుంది’’అని ఎంపీ రాఫెల్‌ గ్లుక్స్‌మన్‌.. తైవాన్‌ అధ్యక్షుడు సాయ్‌ ఇంగ్‌-వెన్‌తో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు. ఇది ఈయూ-తైవాన్‌ భాగస్వామ్యానికి తొలి అడుగు మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతాయని చెప్పారు. గత నెలలో తైవాన్‌తో బంధాన్ని పెంచుకోవాలనే తీర్మానాన్ని యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుల బృందం తైవాన్‌ పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని