
Russia: రష్యాను హెచ్చరించిన ఐరోపా సమాఖ్య..!
ఇంటర్నెట్‌డెస్క్: ఐరోపా సమాఖ్య నాయకులు రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకొన్నా.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సేనల మోహరింపులను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు స్పందించారు. ఈ ఏడాది చివరి ఐరోపా సమాఖ్య కౌన్సిల్ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో రష్యాను కట్టడి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కానీ, అవేమిటో మాత్రం బయటకు వెల్లడించలేదు. దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా పేర్కొంది. కానీ, పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం రష్యా దాదాపు లక్షమంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించనట్లు వెల్లడిస్తున్నాయి. జనవరి చివరి నాటికి రష్యా తమ సైనిక చర్యను ప్రారంభిస్తుందని ఉక్రెయిన్ చెబుతోంది. అమెరికా కూడా రష్యా వైఖరిని అనుమానిస్తోంది. దాడికి సంబంధించి రష్యా అధ్యక్షుడు ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారనే దానిపై స్పష్టత లేదని చెబుతున్నాయి.
‘‘ఉక్రెయిన్‌పై ఎటువంటి సైనిక చర్య అయినా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ప్రతి స్పందనగా భాగస్వాములతో కట్టడికి చర్యలు తీసుకొంటాము’’ అని ఐరోపా సమాఖ్య నేతలు పేర్కొన్నారు. దీనిలో వారు అమెరికా, యూకే సహకారం తీసుకొంటామని రష్యాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. సమాఖ్య సమావేశం తర్వాత ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డేర్ లేయాన్ మాట్లాడుతూ రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.