Sunita Kejriwal: బెయిల్ ఆర్డర్‌ అప్‌లోడ్‌ కాకముందే.. ఈడీ కోర్టుకెలా వెళ్లింది?: సునీత కేజ్రీవాల్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తీరుపై శుక్రవారం సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal) నిప్పులు చెరిగారు.

Published : 21 Jun 2024 15:45 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తీరుపై శుక్రవారం సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal) మండిపడ్డారు. దిల్లీలో నీటి సమస్యను(water crisis) పరిష్కరించాలని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు శుక్రవారం భోగల్‌లో చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఇందులోభాగంగా సునీత మాట్లాడుతూ తన భర్త, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకముందే ఈడీ ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని అసహనం వ్యక్తంచేశారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

దిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో దేశ రాజధానికి రోజుకు 100 మిలియన్‌ గ్యాలన్ల నీటిని హరియాణా(Haryana) విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆప్‌ మంత్రి ఆతిశీ(Atishi)  నిరాహార దీక్ష చేస్తున్నారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమె బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

కాగా మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేవరకు ఆయనకు బెయిల్ మంజూరుచేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని