Published : 31 May 2021 14:45 IST

Wuhan:సైనిక కార్యకలాపాలకు నెలవు

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌: కరోనా మూలాలపై మరోసారి విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌లో సైనికపరమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చైనా సైనిక వ్యవస్థ ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’తో సంబంధం ఉన్న కొన్ని కార్యక్రమాలు ల్యాబ్‌లో జరుగుతున్నట్లు కచ్చితంగా చెప్పగలనన్నారు. సాధారణ పరిశోధనలతో పాటు రహస్యంగా ఇంకా ఏదో జరుగుతోందని అన్నారు. దానికి సంబంధించిన వివరాలను చెప్పడానికి చైనా నిరాకరించిందన్నారు. కనీసం ఏ తరహా పరిశోధనలు చేస్తున్నారో వెల్లడించడానికి కూడా అంగీకరించలేదన్నారు. చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన నిపుణులను సైతం ఆ ప్రాంతంలోకి అనుమతించలేదన్నారు.

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందన్న వాదన బలపడుతున్న విషయం తెలిసిందే. సహజసిద్ధమైన కరోనా వైరస్‌ను రీఇంజినీరింగ్‌ చేసి ప్రమాదకరంగా వ్యాపించేలా చేశారని ఇటీవల నార్వే, బ్రిటన్‌కు చెందిన ఇద్దరు కీలక శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. మరోవైపు వైరస్‌ వ్యాప్తి ప్రారంభానికి ముందే వుహాన్‌ ల్యాబ్‌లో ముగ్గురు శాస్త్రవేత్తల్లో కరోనా లక్షణాలు కనిపించాయన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయ్యిందన్న వాదనపై లోతైన పరిశోధన జరిపేందుకు సహకరించాలని ప్రపంచ దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సర్కార్‌ సైతం విచారణకు అనుమతించి, సహకరించాలని చైనాను కోరింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని