Published : 08 Nov 2021 01:16 IST

Satyapal Malik: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మేఘాలయ గవర్నర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతు నిరసనలు, అవినీతి తదితర విషయాల్లో గత కొన్నాళ్లుగా వరుస షాకింగ్‌ కామెంట్లు చేస్తున్న మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన జైపుర్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. తాను రైతు నిరసనలపై మాట్లాడినప్పుడల్లా అది వివాదాస్పదమవుతోందని, దీంతో దిల్లీ నుంచి ఫోన్‌ వస్తుందేమో ఆలోచించాల్సి వస్తోందని అన్నారు. ‘దిల్లీ నేతలు.. ఒక జంతువు చనిపోయినప్పుడు కూడా సంతాపం వ్యక్తం చేస్తారు. కానీ, కొన్నాళ్లుగా సాగుతున్న నిరసనల్లో దాదాపు 600 మంది రైతులు మరణించినా.. లోక్‌సభలో కనీసం వారి ప్రస్తావన తీసుకురాలేదు’ అని కేంద్ర ప్రభుత్వ నేతలపై పరోక్షంగా విమర్శించారు.

‘వారు కోరితే.. పదవి వదిలేస్తా’

‘గవర్నర్‌ను తొలగించలేరు. కానీ.. కొంతమంది మాత్రం నేనేమైనా వివాదాస్పదంగా మాట్లాడాలి.. ఫలితంగా పదవి కోల్పోవాలి.. అని ఎదురుచూస్తున్నారు. నాకు తెలుసు.. నేను దిల్లీ నేతలకు విరుద్ధంగా మాట్లాడుతున్నా. ఒకవేళ వారు పదవి వదులుకోవాలని కోరితే.. ఒక్క నిమిషం కూడ ఆలస్యం చేయను’ అని వ్యాఖ్యానించారు. రైతు చట్టాల విషయంలో అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని ఆయన గతంలోనూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కర్షకుల డిమాండ్లు తీర్చకపోతే భాజపా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని