మహారాష్ట్ర హోంమంత్రిపై సంచలన ఆరోపణలు!

మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం. రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి ......

Updated : 21 Mar 2021 11:36 IST

సీఎం ఉద్ధవ్‌కు ముంబయి మాజీ కమిషనర్‌ లేఖ

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో అరెస్టెయిన వాజేను నెలకు ₹100 కోట్లు వసూలు చేయాలని ఆయన సూచించారంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు పరంబీర్‌ సింగ్‌ లేఖ రాశారు. అంబానీ కేసులో విచారణ సరిగా చేపట్టని కారణంగా బదిలీ అయిన కొద్ది రోజులకే ఆయన ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

ముంబయి క్రైమ్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ హెడ్‌గా ఉన్న వాజేను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కొన్ని నెలలుగా పలుమార్లు తన నివాసానికి పిలిపించుకున్నారని పరంబీర్‌ తన లేఖలో పేర్కొన్నారు. తన కోసం నిధులు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని తన లేఖలో పరంబీర్‌ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సీఎం, హోంమంత్రి ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని