crime news: పోలీసులకు ఫోన్‌ చేసి మరీ ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి ఆత్మహత్య..!

మనమరాలిని వేధించినట్లు తనపై కోడలే కేసు పెట్టడంతో ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు

Published : 27 May 2022 17:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సొంత మనవరాలిని వేధించినట్లు తనపై కోడలే కేసు పెట్టడంతో ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు పోలీసు ఎమర్జెన్సీ నంబర్‌ 112కు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొన్నారు. కానీ, అప్పటికే ఇంటి ట్యాంక్‌పైకి ఎక్కిన రాజేంద్ర తుపాకీతో కాల్చుకొంటానని పోలీసులను బెదిరించారు. అధికారులు లౌడ్‌స్పీకర్‌లో ఆయనతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఆయన రాజీపడ్డట్లు అనిపించినా.. హఠాత్తుగా తుపాకీతో గుండెలపై కాల్చుకొన్నారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానిక పోలీస్‌ అధికారి పంకజ్‌ భట్‌ మాట్లాడుతూ ‘‘కుటుంబసభ్యుల నుంచి ఆరోపణల విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందారు’’ అని పేర్కొన్నారు. బహుగుణ కుమారుడు అజేయ్‌ ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి, ఓ పొరుగింటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజేంద్ర బహుగుణపై బుధవారం ఆయన కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనవరాలితో బహుగుణ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఈ ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో కలత చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో బహుగుణ కాంగ్రెస్‌ తరపున ఎన్డీ తివారీ మంత్రి వర్గంలో పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని