Published : 03 Feb 2022 14:59 IST

Pegasus Row: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌.. !

పరిశీలనలో ఉందన్న రాజ్యసభ ఛైర్మన్‌

దిల్లీ: పార్లమెంటును తప్పుదోవపట్టించారంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై పలువురు సభ్యులు ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌ తన పరిశీలనలో ఉందని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. పరిశీలన అనంతరం దీనిపై కేంద్ర మంత్రి నుంచి స్పష్టత కోరుతానన్నారు. వాటి ఆధారంగా ప్రివిలేజ్‌ మోషన్‌ను అనుమతించాలా లేదా తోసిపుచ్చాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని రాజ్యసభ ఛైర్మన్‌ స్పష్టం చేశారు.

కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌తోపాటు తృణమూల్‌, సీపీఐకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో పెగాసస్‌ అంశంపై కేంద్రమంత్రి ఇచ్చిన వివరణ సభను తప్పుదోవ పట్టించేట్లు ఉందని అందులో పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఓ నుంచి తాము స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదంటూ మంత్రి పేర్కొనడాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందంలో భాగంగా 2017లోనే కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందంటూ ఇటీవల ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనాన్ని ఉదహరించారు. పార్లమెంట్‌ సభ్యులను తప్పదోవ పట్టించేందుకు మంత్రి చేసిన ప్రయత్నం సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్‌ను కోరారు. తాజాగా ఈ అంశాన్ని మరికొందరు సభ్యులు ప్రస్తావించగా.. ఇప్పటికే ఈ అంశం తన పరిశీలనలో ఉందని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని