GST: జీఎస్టీ పరిహారం కాల పరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి: కాంగ్రెస్‌ డిమాండ్‌

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడిందని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన ....

Published : 14 May 2022 15:50 IST

ఉదయ్‌పూర్‌: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడిందని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. ఇందుకోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోన్న జీఎస్టీ పరిహారం కాల వ్యవధిని మరో మూడేళ్లు పెంచాలని డిమాండ్‌ చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ నవసంకల్ప్‌ చింతన్‌ శిబిరం వద్ద కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం- రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్రమైన సమీక్షకు సమయం ఆసన్నమైందన్నారు. 2017లో మోదీ సర్కార్‌ పేలవంగా రూపొందించిన జీఎస్టీ చట్టం అన్యాయంగా అమలు చేస్తుండటంతో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రతిఒక్కరూ చూస్తున్నారన్నారు.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూలేనంతగా బలహీనపడటంతో తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య పూర్తిగా విశ్వాసం దెబ్బతిందన్న చిదంబరం.. ఈ ఏడాది జూన్‌ 30తో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు గడువు ముగియనుండటంతో కాల పరిమితిని మరో మూడేళ్లు పొడిగించాల్సిందేనన్నారు. ఒకవేళ దాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రయత్నిస్తే.. తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని