ట్రంప్‌.. ఆ ఆలోచన కూడా రానీయొద్దు!

ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నాన్ని ఇంకా కొనసాగించొద్దన్న పదిమంది మాజీ  రక్షణ మంత్రులు

Updated : 09 Dec 2022 15:06 IST

మాజీ రక్షణ మంత్రుల అసాధారణ లేఖ..

వాషింగ్టన్: కొద్ది రోజుల్లోనే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నాన్ని ఇక కొనసాగించొద్దంటూ పదిమంది మాజీ రక్షణ మంత్రులు ఆయనకు సూచించారు. ఇందుకుగాను సైన్యాన్ని వాడాలన్న తలంపు కూడా రానీయొద్దని వారు సలహా ఇచ్చారు. ఈ బృందంలో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం. అగ్రరాజ్య మాజీ రక్షణ మంత్రుల బృందం ఈ మేరకు ఓ బహిరంగ లేఖను రాయగా.. దానిని వాషింగ్టన్‌పోస్టు ప్రచురించింది.

రాజ్యాంగం ప్రకారం జనవరి 20న జరగాల్సిన అధ్యక్ష పదవీ బాధ్యతల శాంతియుత బదలాయింపు అంశంలో.. వీరు ట్రంప్‌ వైఖరిపై పరోక్షంగా అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల్లోనూ, అనంతరం న్యాయస్థానాల్లోనూ విషయం సుస్పష్టమైందని..  అధ్యక్ష ఎన్నికల ఫలితం కళ్లకు కట్టినట్టు కనపడుతోందని వారు తెలియచేశారు. ఎన్నికల ఫలితాలను ప్రశ్నించాల్సిన సమయం ముగిసి పోయిందని.. రాజ్యాంగ బద్ధంగా అధికారాన్ని అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్‌కు తెలిపారు.

అలాకాకుండా.. ఎన్నికల్లో మోసం జరిగిందని నిరూపించేందుకు సైన్యం ఉపయోగించాలన్న ఆలోచన కూడా రానీయవద్దని మాజీ రక్షణ మంత్రుల బృందం ట్రంప్‌కు సూచించింది. అది ప్రమాదకం, చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని హితవు అధ్యక్షుడికి హితవు పలికారు.

ఇవీ చదవండి..

వారం వ్యవధిలో మరోసారి తగ్గిన కరోనా కేసులు..

వ్యాక్సిన్‌ అనుమతిపై WHO ఏమందంటే..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని