Updated : 16 Mar 2022 18:44 IST

Sonia Gandhi: ‘ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల జోక్యం ఏంటి..?’

దిల్లీ: భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాక్‌ చేసేందుకే సామాజిక మాధ్యమ వేదికల దుర్వినియోగం జరుగుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల ప్రక్రియలో ఆ మాధ్యమాల జోక్యాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్‌లో జీరో అవర్‌లో మీడియా కథనాలు ఉటంకిస్తూ ఆమె మాట్లాడారు. 

‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నిర్వహించే ఎన్నికల్లో ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల జోక్యానికి ముగింపు పలకాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నాయకులు.. పార్టీల రాజకీయ కథనాల ప్రచారానికి ఈ సంస్థలను వాడుతున్నారు. ఆ వేదికల ద్వారా ప్రచారం అవుతోన్న తప్పుడు సమాచారంతో ప్రజల మనస్సు ద్వేషంతో నిండిపోతోంది. ఈ అంతర్జాతీయ సంస్థలు అన్ని పార్టీలతో ఒకేరకంగా వ్యవహరించడంలేదని పలుమార్లు ప్రజల దృష్టికి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా దేశ సామరస్యానికి భంగం కలుగుతోంది. పాలక వర్గానికి, పెద్ద సంస్థలకు మధ్య పెరుగుతోన్న అనుబంధాన్ని ఈ కథనాలు వెల్లడిచేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం సరికాదు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మన ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలి’ అని ఆమె అన్నారు. అలాగే ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే భాజపా ప్రకటనలకు ఫేస్‌బుక్‌ తక్కువ ధర వసూలు చేస్తోందని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను సోనియా ఈ సందర్భంగా  ప్రస్తావించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని