Facebook: యువకుడి ప్రాణాన్ని కాపాడిన ఫేస్‌బుక్‌ సాంకేతికత

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లోని ఓ సాంకేతిక పరిజ్ఞానం ఆత్మహత్యకు సిద్ధమైన ఓ విద్యార్థి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ‘నీట్‌’ పరీక్షలో ఉత్తీర్ణత

Published : 10 Sep 2022 07:18 IST

లఖ్‌నవూ: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లోని ఓ సాంకేతిక పరిజ్ఞానం ఆత్మహత్యకు సిద్ధమైన ఓ విద్యార్థి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ‘నీట్‌’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయానన్న ఆవేదనతో లఖ్‌నవూకు చెందిన 29 ఏళ్ల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీనికి సంబంధించి అతడు ఫేస్‌బుక్‌లో ఓ సందేశాన్ని ఉంచాడు. రియల్‌ టైం సాంకేతికతతో ఫేస్‌బుక్‌ దీన్ని గుర్తించింది. వెంటనే ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులను అప్రమత్తం చేస్తూ సందేశాన్ని పంపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన ఆ విద్యార్థి ఇంటికి చేరుకుని అతణ్ని రక్షించారు. కుంగుబాటు, ఇతర ప్రాణహాని పరిస్థితులకు సంబంధించిన సందేశాలు పోస్ట్‌ అయినప్పుడు వెంటనే సమాచారం అందించేలా ఫేస్‌బుక్‌, యూపీ పోలీసు శాఖ మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. దీంతోనే విద్యార్థిని రక్షించడం సాధ్యమైందని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని