Facebook: శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్..

తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసేలా ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

Updated : 10 Jun 2021 21:36 IST

ఉద్యోగుల ముందు ప్రత్యామ్నాయం

వాషింగ్టన్‌: తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసేలా ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. అలాగే వారి నివాస స్థలాలు మార్చుకునే వెసులుబాటును ఇస్తున్నట్లు వెల్లడించింది. జూన్‌ 15 నుంచి ఉద్యోగులకు ఈ అవకాశాన్ని ఇవ్వనుంది. ‘మనం ఎక్కడి నుంచి పనిచేస్తున్నామనే దానికంటే ఎలా పనిచేస్తున్నామనేదే ముఖ్యం. ఉత్తమంగా పనిచేయగల ప్రదేశంలోనే ఉద్యోగులు ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని ఫేస్‌బుక్‌ మీడియాకు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు పలు సంస్థలు అవకాశం ఇచ్చాయి. 

అలాగే ఇంటి నుంచి పని(వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) శాశ్వతం కానుందని తాను భావిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్ బర్గ్ అన్నారు. దానిలో భాగంగా నివసించే ప్రాంతం నుంచి పనిచేయగల ఉద్యోగుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోపక్క ఏడాదిన్నర కాలంగా మూసి ఉంచిన కార్యాలయాలను ఫేస్‌బుక్‌ తిరిగి తెరుస్తోంది. అంతేకాకుండా తిరిగి వచ్చే ఉద్యోగుల షెడ్యూల్ కూడా సరళంగా ఉంటుందని చెప్పింది. అలాగే జూన్ 15 నాటికి పలు దేశాలకు ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రముఖ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ దీనిపై తమ విధానాన్ని ప్రకటించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని