Published : 08 Nov 2021 15:05 IST

Facebook: ఫేస్‌బుక్‌తో 36 కోట్ల మందికి ముప్పే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఈ యాప్‌ వల్ల నిద్ర, పని, బంధాలు, పిల్లల పెంపకం వంటి వాటిల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫేస్‌బుక్‌ స్వయంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌  పేర్కొంది. యాప్‌ను వినియోగిస్తోన్న మొత్తం 2.9 బిలియన్ల మంది వినియోగదారుల్లో 360 మిలియన్ల మంది (12.5శాతం) ప్రభావితం అవుతున్నారని సంస్థ అంచనా వేసింది. ఈ యాప్‌ వినియోగానికి బానిసగా మారిన వారిలో ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఈ పరిశోధనా పత్రం పేర్కొంది.

ఇవన్నీ ఫేస్‌బుక్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు. ఇటువంటి వినియోగాన్ని ఫేస్‌బుక్‌ సమస్యాత్మకంగా పేర్కొంది. సాధారణంగా మెటాతో సహా ఏ సోషల్‌ మీడియా కంపెనీ అయినా వినియోగదారులు తరచూ తమ యాప్‌ను వినియోగించాలని కోరుకుంటాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల క్రితమే ఫేస్‌బుక్‌ దుష్ప్రభావాలను అంచనావేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు సూచనలు చేసింది. కానీ, 2019లో ఈ బృందాన్ని ఫేస్‌బుక్‌ రద్దు చేసింది. 2020లో అంతర్గత సమావేశంలో తాము కనుగొన్న అంశాలను ఈ బృందం ప్రస్తావించింది.

ఇటీవల ఫేస్‌బుక్‌ అంతర్గత పత్రాలను ఫ్రాన్సిస్‌ హ్యూగన్‌ అనే మాజీ ఉద్యోగి ‘ఫేస్‌బుక్‌  ఫైల్స్‌ సిరీస్‌’ పేరిట విడుదల చేయడంలో భాగంగా ఇవి వెలుగు చూశాయి. ఇన్‌స్టాగ్రామ్‌ వాడిన వినియోగదారులు మానసికంగా ప్రతికూల ప్రభావానికి గురవుతున్నారని ఇన్‌సైడర్‌లోని బెన్‌ గిల్‌బెర్ట్‌ రిపోర్టు పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని