JEE Main 2023: జేఈఈ మెయిన్‌ పరీక్ష.. ఆ వార్తలు నమ్మొద్దు: ఎన్‌టీఏ

జేఈఈ మెయిన్‌(JEE main2023) తొలి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్‌లో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్టు వచ్చిన వార్తలపై జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఉన్నతాధికారులు అధికారులు స్పందించారు.

Published : 16 Nov 2022 01:51 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌(JEE main2023) తొలి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్‌లో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్టు వచ్చిన వార్తలపై జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఉన్నతాధికారులు అధికారులు స్పందించారు. జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎలాంటి నోటీసు విడుదల చేయలేదని తెలిపారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఫేక్‌ నోటీస్‌ సర్క్యులేట్‌ అవుతోందని ఎన్‌టీఏ డీజీ వినీత్‌ జోషీ స్పష్టంచేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

వచ్చే ఏడాది నుంచి రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు ఇప్పటికే అధికారులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 23 వరకు తొలి విడత పరీక్ష, ఏప్రిల్‌ 4 నుంచి 9 వరకు రెండో విడత పరీక్ష జరగనున్నట్టు ఎన్‌టీఏ పేరుతో ఓ సర్క్యులర్‌ సామాజిక మాధ్యమాల్లో నిన్న చక్కర్లు కొట్టింది. దీనికి దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌లోనే ప్రారంభమవుతుందని పేర్కొంది. అయితే, దీనిపై స్పందించిన అధికారులు.. తాము ఎలాంటి తేదీలను నిర్ణయించలేదని స్పష్టంచేశారు. దేశంలోని ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (BE/Btech/BArch,etc) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో టాప్‌ స్కోర్‌ సాధించిన 2.5లక్షల మంది ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు