CEC: ఎన్నికల నిర్వహణకు.. సవాలుగా మారుతోన్న సోషల్ మీడియా ఫేక్ కథనాలు
దేశంలో ఎన్నికల నిర్వహణకు పలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య కథనాలు సవాల్‌గా మారుతున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటిస్తోన్న జర్మనీ విదేశాంగ మంత్రి బృందంతో సమావేశమైన సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు.
దిల్లీ: దేశంలో ఎన్నికలను (Elections) స్వేచ్ఛగా నిర్వహించేందుకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య కథనాలు ఇబ్బందిగా మారుతున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఇది ప్రధాన సవాల్‌గా మారడం పెరుగుతోందన్నారు. జర్మనీ విదేశాంగశాఖ బృందంతో సమావేశమైన ఆయన.. ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది భారత చరిత్ర, సంప్రదాయాల్లో భాగంగా ఉందన్నారు.
భారత్‌లో పర్యటిస్తోన్న జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్బాక్ (Annalena Baerbock) నేతృత్వంలోని బృందం.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను దిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో (Nirvachan Sadan) సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ తీరును వివరించిన ఆయన.. మొత్తం 95 కోట్ల ఓటర్లు, 11లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో కోటి మంది సిబ్బంది ఉంటారని.. ప్రతి స్థాయిలోనూ రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. వీటితోపాటు ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని తరలించడాన్ని పక్కనబెడితే.. ప్రతి ఎన్నికల్లోనూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలు నిష్పాక్షిక పోలింగ్‌కు అడ్డంకిగా మారడం పెరుగుతోందన్నారు.
భిన్న సవాళ్లు ఎదురైనప్పటికీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న తీరుపై జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్‌లో పాల్గొని ఈవీఎంలో ఓటు చేశారు. ఈవీఎంల పనితీరు, వాటిలో భద్రతా ప్రమాణాలు, స్టోరేజీలకు సంబంధించి అంశాలను ఆమెతోపాటు వారి ఎంపీల బృందం పరిశీలించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Sethupathi: నేను కేవలం నటుడిని మాత్రమే... విజయ్ సేతుపతి అసహనం
-
World News
Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!
-
Technology News
Whatsapp: వాట్సప్.. ఇక చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవచ్చు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
-
Ap-top-news News
AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!