ఆప్‌ ఎప్పుడూ రైతుల పక్షమే: కేజ్రీవాల్‌

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. రైతుల డిమాండ్లు సరైనవేనని ఆయన పేర్కొన్నారు. వారు శాంతియుతంగా వారి నిరసనలు వ్యక్తం చేస్తుంటే వారిని కించపరచడం సరికాదన్నారు.

Published : 29 Jan 2021 23:05 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. రైతుల డిమాండ్లు సరైనవేనని పేర్కొన్నారు. వారు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే కించపరచడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. దిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్..‌‌ కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఒక ట్వీట్‌కు ఆయన బదులిచ్చారు. ‘‘రాకేశ్‌ జీ, మేం ఎప్పుడూ రైతుల వెంటే ఉంటాం. మీ డిమాండ్లు సరైనవి. మీ ఉద్యమాన్ని కించపరచడం, దేశ ద్రోహులుగా చిత్రీకరించడం చాలా తప్పు. రైతు నాయకులపై కేసులు పెట్టడం సరికాదు’’ అని కేజ్రీవాల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా శుక్రవారం ఘాజీపూర్‌ సరిహద్దుకు వెళ్లారు. రైతుల కోసం దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి కేంద్రాలు, టాయిలెట్లు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రైతులు సరిహద్దులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దిల్లీ-యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్‌లో ధర్నా చేస్తున్న రైతులు గురువారం రాత్రిలోపు ఖాళీ చేయకుంటే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తామని పోలీసులు పేర్కొన్నారు. రైతులు దీనికి అంగీకరించకపోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బలవంతంగా ఖాళీ చేయిస్తే తాను ఉరేసుకుంటానని రాకేశ్‌ టికాయిత్‌ హెచ్చరించారు.

ఇవీ చదవండి..

ఖాళీ చేయిస్తే ఉరేసుకోడానికి సిద్ధం

ఎర్రకోట ఘటన..దేశ ద్రోహం కేసు నమోదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని