Updated : 09/12/2021 14:13 IST

Farmers agitation: రెండ్రోజుల్లో దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తాం: రైతులు

దిల్లీ: ఏడాదికిపైగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. నూతన సాగుచట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేసింది. కాగా.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో రైతులు దిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు. హామీల అమలుకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులు దిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేయనున్నారు.

Read latest National - International News and Telugu News


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని