Updated : 18 Jan 2021 13:08 IST

రైతుల ర్యాలీకి అనుమతిపై మీదే అధికారం!

దిల్లీ పోలీసులకు సుప్రీం హితవు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోకి ఎవరిని.. ఎప్పుడు.. అనుమతించాలనేది పూర్తిగా స్థానిక పోలీసుల అధికార పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా.. వద్దా.. అనేది పోలీసులే నిర్ణయించాలని సూచించింది. జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ పోలీసులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజున ర్యాలీ అనేది పూర్తిగా శాంతిభద్రతల అంశమని ధర్మాసనం తెలిపింది. పోలీసులు ఏం చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా చేస్తే గణతంత్ర ఉత్సవాలకు ఆటంకం కలుగుతుందని, నిలుపుదల చేయించాలని కేంద్రం తరఫున దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మరోవైపు రైతుల ఆందోళన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మంగళవారం భేటీ కానుంది.

ఇవీ చదవండి...

రైతుకు కన్నీరు.. వ్యాపారికి పన్నీరు

రిపబ్లిక్‌డే రోజునే ర్యాలీ

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని