అనుకున్న దారిలోనే ర్యాలీ: రైతు సంఘాలు

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ల ర్యాలీ అనుమతిపై పూర్తి అధికారాలు దిల్లీ పోలీసులవే అని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సింఘు సరిహద్దుకు సమీపంలోని ఓ రిసార్టులో రైతు సంఘాలు, పోలీసులు మరోసారి చర్చలు జరిపారు.

Updated : 21 Jan 2021 20:21 IST

ముందుకుసాగని రైతులు- దిల్లీ పోలీసుల చర్చలు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ల ర్యాలీ అనుమతిపై పూర్తి అధికారాలు దిల్లీ పోలీసులవే అని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సింఘు సరిహద్దుకు సమీపంలోని ఓ రిసార్టులో రైతు సంఘాల ప్రతినిధులు, పోలీసులు మరోసారి చర్చలు జరిపారు. దిల్లీ పోలీసులు ట్రాక్టర్ల ర్యాలీని కుండ్లి-మనేసర్-పాల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్వహించాలని పోలీసులు సూచిస్తుండగా, ముందు అనుకున్న విధంగానే దిల్లీ ఔటర్‌ రింగురోడ్డుపైనే ర్యాలీని నిర్వహిస్తామని రైతు సంఘాలు పట్టబట్టుతున్నాయి. సమావేశం అనంతరం స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘ వ్యవసాయచట్టాల రద్దు కోసం దిల్లీలో మేం ర్యాలీని ప్రశాంతంగా నిర్వహించాలనుకుంటున్నాం. కానీ పోలీసులు దిల్లీకి బయట ర్యాలీని నిర్వహించాలని సూచిస్తున్నారు. దానికి మేం ఏమాత్రం ఒప్పుకోం’’ అని యోగేంద్ర అన్నారు. జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ యాదవ్‌ ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. లా అండ్‌ ఆర్డర్‌ ప్రత్యేక కమిషనర్‌ సంజయ్‌ సింగ్‌, పోలీసు కమిషనర్‌ (ఇంటిలిజెన్స్‌) దేపేంద్ర పాతక్‌, దిల్లీ, హర్యానా, యూపీలకు చెందిన సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం కూడా పోలీసులకు, రైతు సంఘాలకు చర్చలు జరగ్గా అవి ఫలించలేదు.

మరోవైపు సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చేవరకూ వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలిపేస్తామని కేంద్రం రైతులకు హామీ ఇచ్చింది. దీనిపై రైతులు తమ నిర్ణయాన్ని శుక్రవారం జరగనున్న చర్చల్లో వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి..

బాగ్దాద్‌లో జంట ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి

పీపీఈ కిట్‌ ధరించి..25 కేజీల బంగారం స్వాహా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని