స్టెప్పులతో అదరగొట్టిన ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా డాన్స్‌తో అదరగొట్టారు. చండీగఢ్‌లో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ మనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఫరూక్‌ అబ్దుల్లా ప్రముఖ గాయకుడు మహమ్మద్‌ రఫీ పాటలకు ఉత్సాహంగా చిందులు వేశారు....

Updated : 27 Feb 2024 20:15 IST

చండీగఢ్‌: జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా డాన్స్‌తో అదరగొట్టారు. చండీగఢ్‌లో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ మనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఫరూక్‌ అబ్దుల్లా ప్రముఖ గాయకుడు మహమ్మద్‌ రఫీ పాటలకు ఉత్సాహంగా చిందులు వేశారు. పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేయడంతోపాటు అభినయంతో ఆకట్టుకున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా డ్యాన్స్‌ చూసిన మరికొందరు ఆయనతో కలిసి సందడి చేశారు. అంతా కలిసి వివాహ వేడుకలో స్టెప్పులతో అదరగొట్టారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని