వారెవ్వా! 2లీటర్ల కూల్‌డ్రింక్‌ 18 సెకన్లలో తాగేశాడు!

మనకు అత్యంత ఇష్టమైన పానీయం ఏదైనా లీటరు తాగాలంటేనే కిందామీదా పడిపోతాం. అలాంటిది రెండు లీటర్ల కూల్‌డ్రింక్‌ సెకన్ల వ్యవధిలో తాగడమంటే మాటలా..! అమెరికాకు...

Updated : 20 Jul 2021 10:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనకు అత్యంత ఇష్టమైన పానీయం ఏదైనా లీటరు తాగాలంటేనే కిందామీదా పడిపోతాం. అలాంటిది రెండు లీటర్ల కూల్‌డ్రింక్‌ సెకన్ల వ్యవధిలో తాగడమంటే మాటలా..! అమెరికాకు చెందిన ఎరిక్‌ బాడ్‌లాండ్స్‌ బూకర్‌ అనే వ్యక్తి కూల్‌డ్రింక్‌ను అత్యంత వేగంగా తాగి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. రెండు లీటర్ల కూల్‌డ్రింక్‌ను కేవలం 18.45 సెకన్లలోనే గుక్క తిప్పుకోకుండా తాగేసి అందరినీ ఔరా అన్పించాడు. తరచూ ఈటింగ్‌, ర్యాపర్‌ పోటీల్లో పాల్గొనే ఎరిక్‌ యూట్యూబర్‌ కూడా. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్ట్స్‌ టైటిల్‌ సాధించాలనేది అతడి కల. దీంతో మే 19న న్యూయార్క్‌లోని సెల్డన్‌లో జరిగిన పోటీల్లో అత్యంత వేగంగా కూల్‌డ్రింక్‌ తాగే పోటీల్లో పాల్గొన్నాడు. ఒక పాత్రలో పోసిన 2లీటర్ల కూల్‌డ్రింక్‌ను గడగడా తాగేసి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఎరిక్‌. అబ్బురపరిచే ఈ వీడియోని మీరూ చూడండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని