
Rajiv Gandhi: నాన్న మరణమే అతిపెద్ద జీవితానుభవం : రాహుల్ గాంధీ
బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత
లండన్: తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యే తన జీవితంలో అతిపెద్ద అభ్యసన అనుభవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ సంఘటనే తనను ఎన్నో విషయాలు నేర్చుకునేలా చేసిందన్న మాట వాస్తవమన్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడారు.
ముఖాముఖిలో భాగంగా రాజీవ్ గాంధీ వర్ధంతిని ప్రస్తావించిన భారత సంతతి విద్యావేత్త డాక్టర్ శ్రుతి కపిలా.. హింస, వ్యక్తిగతంగా దాంతో మనుగడ సాగించడం ఎలా అని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన రాహుల్ గాంధీ.. ‘నా జీవితంలో అతిపెద్ద అభ్యసన అనుభవం మా నాన్న మరణం. అంతకంటే అతిపెద్ద ఘటన ఏదీలేదు. అయితే, మా నాన్నను చంపిన వ్యక్తి లేదా దళం చేసిన పని నాకు అత్యంత బాధను మిగిల్చింది. ఓ కొడుకుగా నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసింది. అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించింది. అందుకే మీరు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నంత కాలం దుర్మార్గులు ఎలా ఉన్నా పర్వాలేదు’ అంటూ రాహుల్ గాంధీ బదులిచ్చారు.
ఇక భారత ప్రధాని గురించి ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. ‘మోదీ తనపై మాటల దాడి చేసినప్పుడు.. దేవుడా.. ఆయన దారుణంగా నాపై దాడి చేస్తున్నాడు అనుకుంటాను. కానీ, అదే సమయంలో ఆయన నుంచి కొంత నేర్చుకుంటాను. అలాగే కానివ్వండి అంటూ వాటిని స్వాగతిస్తూ ముందుకెళ్తాను’ అని రాహుల్ గాంధీ వివరించారు. బలమైన శక్తులను ఎదుర్కొనే సమయంలో ఎప్పుడూ బాధపడాల్సి వస్తుందని.. అదే సమయంలో అటువంటి శక్తులపై ఎలా పోరాడాలో తెలుస్తుందని అన్నారు. ఇక దేశ రాజకీయాలపై అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన ఆయన.. రాజకీయాలు సరదాగా చేసుకునే వ్యాపారం మాత్రం కాదన్నారు.
ఇదిలాఉంటే, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. లండన్‌లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు అక్కడి ప్రతిపక్ష నేతలు, పార్టీ మద్దతుదారులు, యూకే ప్రతిపక్ష ఎంపీలు, పలువురు మంత్రులతో రాహుల్ గాంధీ వరుసగా భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యావేత్తలు, నిపుణులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత
-
Politics News
Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
General News
Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
-
General News
Top ten news @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
General News
AP minister suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం