‘స్ట్రెయిన్‌’ నిర్ధారణ పరీక్షలపై ఎఫ్‌డీఏ హెచ్చరిక

ఉత్పతరివర్తనం చెందిన కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు చూపించే అవకాశం ఉందని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన బి.1.1.7 కొత్త స్ట్రెయిన్‌........

Updated : 10 Jan 2021 06:15 IST

తప్పుడు ఫలితాలు సూచించే అవకాశం ఉందన్న సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్పతరివర్తనం చెందిన కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు చూపించే అవకాశం ఉందని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన బి.1.1.7 కొత్త స్ట్రెయిన్‌ వ్యక్తులకు సోకినప్పటికీ ఆర్‌టీ పీసీఆర్‌ వంటి పరీక్షల్లో నెగెటివ్‌గా తేలే ప్రమాదం ఉందని సూచించింది. ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 50 వరకు కొత్త స్ట్రెయిన్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

‘సార్స్‌ కొవిడ్‌-2 మాలిక్యులర్‌ పరీక్షల్లో ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ తప్పుడు ఫలితాలు చూపించే అవకాశం ఉంది. ఈ మేరకు అమెరికాలోని ప్రయోగశాలల సిబ్బంది, ఆరోగ్య సిబ్బందిని ఎఫ్‌డీఏ నుంచి అప్రమత్తం చేస్తున్నాం. అన్ని వైరస్‌ల మాదిరిగానే కాలక్రమేణా కొవిడ్‌-19 ఉత్పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నమూనాలు పరీక్షించినప్పుడు తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు చూపించొచ్చు’ అని ఎఫ్‌డీఏ తెలిపింది. జన్యు పరివర్తన చెందిన వైరస్‌ స్ట్రెయిన్‌లను పరీక్షించినప్పుడు ఫలితాలు సరిగ్గా వచ్చాయో లేదో తనిఖీ చేసి బాధితులకు నివేదికలు ఇవ్వాలని ఆ సంస్థ ఆదేశించింది.

ఇవీ చదవండి..
ఇప్పుడు యూఎస్‌ రకం కరోనా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని