Cheetah: కునో పార్కులో మరో చీతా మృతి.. 40 రోజుల్లో మూడో ఘటన..!

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో మరో చీతా (Cheetah) చనిపోయింది. కునో నేషనల్‌ పార్క్‌లో చీతా మరణించడం 40 రోజుల్లో ఇది మూడో ఘటన.

Updated : 09 May 2023 19:02 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కునో నేషనల్‌ పార్క్‌ (Kuno National Park)లో మరో చీతా (Cheetah) ప్రాణాలు కోల్పోయింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మంగళవారం మృతిచెందింది. పార్క్‌లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో దక్ష చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. కునోలో చీతా మరణించడం దాదాపు 40 రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం.

నబీమియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడ చీతా (Cheetah) ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. భారత్‌కు రాకముందు నుంచే మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చీతా.. మరింత అస్వస్థతకు గురై మృతిచెందింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్‌ అనే మగ చీతా.. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న అనారోగ్యానికి గురైంది. ఆ చీతాను జాగ్రత్తగా వైద్య కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా అది చనిపోయినట్లు కునో జాతీయ పార్కు (Kuno National Park) చీఫ్‌ కన్జర్వేటివ్‌ అధికారి జేఎస్‌ చౌహాన్‌ వెల్లడించారు.

ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని మోదీ వాటిని కునో పార్క్‌లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో విడుదల చేశారు. ఇక, రెండో విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి కునోలో వదిలారు. వీటిల్లో ఇప్పటివరకు మూడు చీతాలు చనిపోయాయి. అయితే.. నమీబియాను తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి ఈ ఏడాది మార్చిలో నాలుగు కూనలకు జన్మనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని