
ప్రైవేటులో 75% కోటా: ఫిక్కీ ఏమందంటే..!
దిల్లీ: ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. ‘పోటీ ప్రపంచంలో పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఉత్తమ మానవ వనరులను ఎంపిక చేసుకొని విజయవంతంగా తమ కార్యాకలాపాలను కొనసాగించేందుకే మొగ్గుచూపుతారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సంస్థలు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ అన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, అంతేకాకుండా భారత పౌరులకు దేశంలో ఎక్కడైనా పనిచేసే స్వేచ్ఛకు ఇది వ్యతిరేకంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు.
ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రైవేటు రంగంలో నెలకు రూ.50 వేల వేతనం కంటే తక్కువ వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఖట్టర్ ప్రభుత్వం గతేడాది ఉద్యోగ కల్పనకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో గవర్నర్ ముందుకు వెళ్లింది. ఈ మేరకు గవర్నర్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీనిపై పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana news: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. తప్పిన ప్రమాదం
-
Business News
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 700+
-
Related-stories News
Prince Charles: ఖతర్ నుంచి నగదు రూపంలో విరాళాలు తీసుకున్న ప్రిన్స్ ఛార్లెస్
-
Business News
GST: క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
CM KCR: సీఎం ఇలాకాలో కలికితురాయి.. గజ్వేల్‌కు గూడ్స్ బండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- లీజుకు క్వార్టర్లు!