Afghanistan: అఫ్గాన్‌ ఫుట్‌బాల్‌ మహిళా క్రీడాకారుల్ని ఆదుకున్న ఫిఫా

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును కాలరాస్తున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌ ఫుట్‌బాల్‌ మహిళా క్రీడాకారుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. వారి ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన

Published : 17 Oct 2021 01:46 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును కాలరాస్తున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌ ఫుట్‌బాల్‌ మహిళా క్రీడాకారుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. వారి ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన అంతర్జాతీయ సాకర్‌ గవర్నింగ్‌ బాడీ ‘ఫిఫా’ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. తొలుత అఫ్గాన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ మహిళా క్రీడాకారులు, కోచ్‌లు, వారి కుటుంబసభ్యులు మొత్తం వందమందిని కాబూల్‌ నుంచి ఖతర్‌లోని దోహాలో సురక్షిత ప్రాంతానికి తరలించింది. 

ఈ ఎయిర్‌లిఫ్ట్‌ ఆపరేషన్‌ చేపట్టడానికి ఫిఫా.. ఖతర్‌ ప్రభుత్వం సహాయం తీసుకుంది. గత ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న నాటి నుంచే వారిని ఆ దేశం నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాలిబన్లతో ఫిఫా ప్రతినిధులు చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఇటీవల మహిళా క్రీడాకారులు, కోచ్‌లు, వారి కుటుంబసభ్యులకు పాస్‌పోర్టు, ఇతర ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కావడంతో వారిని క్షేమంగా దోహాకి తరలించారు. అఫ్గాన్‌లో ఉండిపోయిన మరికొంత మంది ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్ని, వారి కుటుంబసభ్యుల్ని కూడా ఆ దేశం నుంచి తరలించే ప్రయత్నం చేయనన్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని